Monday, December 23, 2024

తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ‘వందేభారత్’ రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ‘వందేభారత్’ రైలు రానుంది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, హైదరాబాద్- టు నాగ్‌పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వేశాఖ ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కాచిగూడ- టు పూణె, హైదరాబాద్- టు బెంగళూరు మధ్య రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపినట్టుగా సమాచారం.

త్వరలోనే వీటికి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్- టు నాగ్‌పూర్ మధ్య రైలును తీసుకురావాలని రైల్వే అధికారులు యోచిస్తున్నట్టుగా తెలిసింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News