Friday, November 22, 2024

ఎన్నాళ్లు..ఇంకెన్నేళ్లు

- Advertisement -
- Advertisement -

దశాబ్దకాలం దాటుతున్న ఆయకట్టు రైతుల కల నెరవేరలేదు. తాలిపేరు ప్రాజెక్టు అదనపు గేట్లు నిర్మిస్తే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఉహించిన రైతుల‘కల’కలగానే మిగిలిపోయింది.65కోట్ల రూపాయాలు ఖర్చు చేసిన అదనపు గేట్ల నిర్మాణ పనులు ఓ కొలిక్కి రాలేదు.ప్రాజెక్టు అధికారులు మరిన్ని నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాధనాలు పంపిన ఫలితం లేదు.2 సంవత్సరాల్లో పూర్తి కవల్సిన అదనపు గేట్ల నిర్మాణం 13సంవత్సరాలు గడుస్తున్న ఎందుకు పూర్తికావడం లేదనేది ఓ పశ్నగా మిగిలిపోయింది.65కోట్ల రూపాయాల నిధులతో ఏం పనులు పూర్తి చేసిన్నట్లు?ఈ నిర్లక్షనికి బాధ్యులు ఎవరు అధికారులా?గుత్తేదారుడి పట్టింపులేని తనమా?అసలు అదనపు గేట్ల నిర్మాణం పూర్తిగా చేపడతారా లేదా అలాగే వదిలేస్తారా?అన్నదాతల మస్తిష్కంలో మేదిలే ఈ ప్రశ్నలకు సమాధనం ఇచ్చేదెవరు!అర్థాంతరంగా ఆగిపోయిన తాలిపేరు ప్రాజెక్టు ఆధునికీకరణ(అదనపు గేట)్ల నిర్మాణ పనులపై‘మన తెలంగాణ’ప్రత్యేక కథనం

చర్ల: మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు భవిష్యత్త్ ప్రశ్నార్థకంగా మారింది.ప్రాజెక్టు ఆదునీకకరణ పనుల పేరుతో అన్నదాతలకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది.ప్రాజెక్టు ఆదునీకరణ పనుల కోసం జపాన్ బ్యాంకు నిధుల నుండి రూ 45కోట్లు మంజూరు చేసింది.ప్రాజెక్టు ఆదునీకకరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టును బలోపేతం చేసే ఆలోచనతో అదనంగా మరోమూడు గేట్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2010 జనవరిలో జపాన్ నిధుల సహాయంతో మొదలైన ఆదునీకకరణ పనుల్లో కొన్ని పనులు పూర్తి చేసినప్పటికి అదనపు గేట్ల నిర్మాణ పనులను మాత్రం అర్థాంతరంగా వదిలేశారు. గోడల వరకు నిర్మాణం పూర్తి చేసి పనులు 13సంవత్సరాలుగా ముందుకు కదలడం లేదు.మూడుగేట్ల నిర్మాణం పూర్తిచేస్తే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావించిన అన్నదతాలకు నిరశే మిగిలింది.

ఇప్పటికే 65కోట్ల రూపాయాలు ఖర్చు చేసినప్పటికి నిర్మాణపనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గుత్తేదారుడి నిర్లక్షం,అధికారుల పట్టింపులేని తనమే ఈ ఫలితాలకు కారణమనే విమర్శలు లేకపోలేదు. రెండెళ్లలో పూర్తికావల్సిన అదనపుగేట్ల నిర్మాణం పనులు పదమూడు సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాలేదు. నిధులు సరిపడక మరికొంత నిధులు అవసరమని దానికోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.ఇప్పటికే కోట్లాది రూపాయాలు ఖర్చు చేసినప్పటికి అదనపు గేట్ల నిర్మాణ పనులు మాత్రం ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆయకట్టు రైతుల ఎదురుచూపులు ఫలించేది ఎప్పుడు?
అదనపు గేట్ల నిర్మాణం పూర్తైతే తమకు మరింత అసరగా ఉంటుందని భావించిన ఆయకట్టు అన్నదాతలకు నిరశే మిగులుతోంది. దాదాపు పదమూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నప్పటికి వారి ఎదురుచూపులు ఫలించడం లేదు. ప్రతిఏడాది తాలిపేరు ప్రాజెక్టును ఆదారం చేసుకుని 24,700 ఎకరాల పంటను అన్నదాతలు సాగుచేస్తుంటారు.అదనపు గేట్ల నిర్మాణం పూర్తైతే పంటసాగు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.ప్రస్తుతం 74మీటర్ల సామార్ధం కగిలిన తాలిపేరు ప్రాజెక్టుకు వర్షకాలంలో ఛత్తీస్గడ్ అడవుల్లోని వాగులు,వంకలు పొంగి భారీస్థాయిలో నీరు చేరుతుంటోంది. కరువుకాలంలో సైతం ప్రాజెక్టు రెండుపంటలకు నీరు అందించిన సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న 25గేట్లకు మరో మూడు గేట్లు తోడైతే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నదాతలు తెలుపుతున్నారు. అధికారులు ఇప్పటికైన స్పందించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అదనపుగేట్ల నిర్మాణం పూర్తి చేసేలా చోరవతీసుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు.ఏజెన్సీ రైతులకు ఎల్లకాలం అండగా నిలిచే తాలిపేరు ప్రాజెక్టు ఆదునీకకరణ పనులను నిర్లక్షం చేయ్యడం సరికదు,రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే పాలకులు తక్షణమే స్పందించి నిధుల మంజూరుకు కృషి చెయ్యాలి.13సంవత్సరాలుగా సాగుతున్న అదనపు గేట్ల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చెయ్యాలి.ఉన్నత అధికారులు ఈ విషయమై ప్రత్యేక చొరవతీసుకోవాలని,లేని యేడల ఆయకట్టు రైతులతో కలిసి ఆందోళనలు చేపడతాం:కొండా చరణ్,సిపిఐ(ఎమ్‌ఎల్)ప్రజాపంథ పార్టీ మండల కార్యదర్శి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News