Monday, December 23, 2024

సిఎం చిత్రపటానికి మంత్రి, జెపిఎస్‌ల పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం వరంగల్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎర్రబెల్లిని జెపిఎస్‌లు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి మంత్రితో కలిసి జెపిఎస్‌లు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మనసున్న మహారాజు.. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని కొనియాడారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ ప్రక్రియను చేపట్టడం హర్షణీయం.జెపిఎస్‌లను క్రమబద్దీకరించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేశారు. ఆ కమిటీలు ప్రక్రియను చేపట్టి, నివేదికలు ఇస్తాయి. నివేదికలు రాగానే జూనియర్ కార్యదర్శులను క్రమబద్దీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News