- Advertisement -
కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ప్రేమ జంట కొండగట్టు ఆలయంలో పెళ్లి చేసుకుని తీరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు వధువును కిడ్నాప్ చేశారు. దీంతో వరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. దాదాపు 15 మంది కారులో వచ్చి తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -