Friday, October 18, 2024

వంశ పాలనల పార్టీలతో ట్రాక్ తప్పిన దేశం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఏళ్ల తరబడి పాలించిన పార్టీలు ఈ దేశానికి ఏం చేశాయని, ఇప్పటికీ వంశానుగత రాజకీయాల జంజాటంలోనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీ డెహ్రాడూన్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పచ్చజెండా చూపి ఆరంభించారు. ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ దేశానికి ఆధునిక హై స్పీడ్ రైళ్లు తీసుకువస్తామని గొప్పలు చెప్పే పార్టీలు రక్తబంధం, పేగుబంధం, వంశానుగత రాజకీయాల్లోనే కూరుకుని ఉన్నాయని తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో రైల్వే వ్యవస్థ బాగా విస్తరించిందని ఇప్పుడు దీని విలువ ఇక్కడ రూ 5000 కోట్లు అయిందన్నారు. 2014కు ముందు ఇది కేవలం రూ 200 కోట్లు ఉండిందని, పెరిగిన విలువతో ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో రైల్వే వ్యవస్థ ఎంతగా విస్తరించుకుని ముందుకు సాగుతున్నదో అర్థం చేసుకోవాలని తెలిపారు. ఉత్తరాఖండ్‌కు వందేభారత్‌ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియలో ఆరంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News