Friday, December 20, 2024

28న హైదరాబాద్‌లో బంజారా ప్రతినిధుల జాతీయ సదస్సు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అఖిల భారత బంజారా ప్రతినిధుల జాతీయ సదస్సు ఈ నెల 28న హైదరాబాద్, బంజరాహిల్స్ లోని బంజారా భవన్ జరుగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను గురువారం మంత్రుల నివాస సముదాయంలో గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ నాయక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రామావత్ వాల్య నాయక్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రు నాయక్, ప్రొఫెసర్ రమణ నాయక్, రాంబాల్ నాయక్, రాంబాబు నాయక్ , సింపల్ బాయి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News