కాచిగూడ : నగరానికి చెందిన ఇద్దరు డాక్టర్లు కృష్ణారెడ్డి(71), డాక్టర్ శోభాదేవి (68)లు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించేం దుకు ఈనెల 6వ తేదీన శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ఈనెల 18వ తేదీన చేరుకుని విజయవంతంగా తమ యాత్రను పూర్తి చేశారు. బేస్ యాత్రను పూర్తి చేసుకుని ఈనెల 23వ తేదీన నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా గురువారం కాచిగూడ వారు మాట్లాడుతూ ..కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించా రు.
ఆరోగ్యంగా ఉంటే ఎదైనా సాధించవచ్చనే సందేశాన్ని నేటి యువతరానికి అందించించేందుకు ఎవరెస్ట్ బెస్ క్యాంపును అధిరోహించినట్లు వారు వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే బాధపడ వద్దని, మళ్లీ పరీక్ష వ్రాసి పాస్ కావచ్చని, క్షణికాశంలో ఆత్మహత్య చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే వదిలేసి తల్లిదండ్రులకు జీవితాంతం క్షోభను మిగల్చవద్దని సూచించారు. వృద్ద వయస్సులో విజయవంతంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను పూర్తి చేసిన వైద్యులను ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విద్యాసంస్థల ప్రతినిధులు, తోటి వైద్య సిబ్బంది ఘనంగా సత్కరించి, అభినందించారు.