Monday, December 23, 2024

రూ 140 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ వీర ఖడ్గం

- Advertisement -
- Advertisement -

మైసూరు : 18వ శతాబ్ధపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ శయనాగారపు కత్తి ఒకటి ఇప్పుడు లండన్‌లో జరిగిన వేలం పాటలో 1,40,80,900 పౌండ్లకు (14 మిలియన్ పౌండ్లకు ) అమ్ముడుపోయింది. దీని విలువ 17.4 మిలియన్ డాలర్లు లేదా రమారమి రూ 140 కోట్ల వరకూ ఉంటుంది.బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ వేలం పాటను నిర్వహించింది. కొనుగోళ్లకు తీవ్రస్థాయి పోటీ జరిగింది. మైసూరు పులిగా చరిత్రలో పేరొందిన టిప్పు సుల్తాన్ అప్పట్లో పలు యుద్ధాలలో గెలిచారు. శత్రువుల రక్షణ నుంచి ఎప్పుడూ ఆయన వద్ద ఉండే ఖడ్గం ఇప్పుడు వేలంలో అమ్ముడయింది. టిప్పు సుల్తాన్ రాజభవనంలో ఆయన పడకగదిలో ఈ ఖడ్గం లభ్యమైంది. గతంలో ఆ ఖడ్గాన్ని వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా ఓ దశలో వేలంలోనే కొనుగోలు చేసి తరువాత విక్రయించారు.

ఇప్పుడు ఈ ఖడ్డం కోసం ముగ్గురు పోటీపడినట్లు వెల్లడైంది. ఇందులో దీనిని దక్కించుకున్న బిడ్డర్ పేరును ఆక్షన్ సంస్థ తెలియచేయలేదు. గోప్యంగా ఉంచింది. ఈ ఖడ్గం గురించి మాల్యా 2016లో ఓ ప్రకటన వెలువరించారు. ఈ ఖడ్గం తాను పొందినప్పటి నుంచి తన కుటుంబానికి నానా బాధలు తలెత్తాయని తెలిపిన మాల్యా దీనిని వదిలించుకుంటున్నట్లు తెలిపారు. విక్రయించారు. అయితే దీనిని ఎవరికి అమ్మింది తెలియచేయలేదు. ఇప్పుడు కూడా ఈ బోన్హమ్స్ వేలం కంపెనీ దీనిని తాము ఎవరికి కట్టబెట్టింది ? దీనిని తాము ఎవరి నుంచి కొనుగోలు చేసింది? వివరాలు వెల్లడించలేదు. అంచనాలు మించి దీని వేలంలో తమకు ఏడురెట్లు అధిక ధరకు కత్తి విక్రయం జరిగినట్లు వివరించారు.

ఇద్దరు ఫోన్ కాల్ ద్వారా వేలంలో పాల్గొన్నారని, ఒక్కరు ప్రత్యక్షంగా తమ హౌస్‌కు వచ్చారని వివరించారు. చాలా అరివీర భయంకర ఖడ్గం. చరిత్రకు ఆనవాలు. ఇది భారీ ధరతోనే పోయిందని నిర్వాహకులు తెలిపారు.చారిత్రక ఆయుధం, కళాత్మకంగా తీర్చిదిద్దిన పిడితో ఉండే ఈ కత్తికి మంచి ధర పలికినందుకు తమకు సంతోషంగా ఉందని సంస్థకు చెందిన ఇస్లామిక్, భారతీయ కళాఖండాల విభాగం అధినేత అయిన నిమా సంఘార్చి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News