న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్(ఇవి) కంపెనీ ఓలా ఇండియా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు సిద్ధమవుతోంది. 2024 సంవత్సరం ప్రారంభంలో ఐపిఒ తీసుకొచ్చేందుకు గాను కంపెనీ ఆర్థిక, న్యాయ సంస్థలతో చర్చలు జరుపుతోంది. కోటక్, గోల్డ్‌మన్ శాచ్స్, సిటిబ్యాంక్, ఇతర బ్యాంకింగ్ భాగస్వాములతో ఐపిఒ విషయంపై కంపెనీ చర్చలు జరుపుతోందని అధికార వర్గాలు తెలిపాయి.
న్యాయ సలహాదారులుగా సిరిల్ అమర్‌చాంద్ మంగళ్‌దాస్, శార్దుల్ అమర్‌చాంద్ మంగళ్‌దాస్ వంటి న్యాయ సంస్థలతోనూ కంపెనీ చర్చలు జరుపుతోంది. కంపెనీ సావరిన్ ఫండ్ ద్వారా 300 మిలియన్ డాలర్ల నిధులను పొందగా, దీంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్ల నుంచి 6 బిలియన్ డాలర్లకు పెరిగింది. వచ్చే నెలల్లో కంపెనీ స్కూటర్ సెగ్మెంట్‌లో 5 నుంచి 6 కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. త్వరగా ఐపిఒ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించాలని ఓలా ఎలక్ట్రిక్ సిఇఒ భవీష్ అగర్వాల్ భావిస్తున్నారు.