Friday, January 3, 2025

ఆన్‌లైన్ వచ్చినా… ‘క్యాషే’ కింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్ని ఆన్‌లైన్ విధానాలు వచ్చినా భౌతికంగా డబ్బుకు ఆధరణ మాత్రం తగ్గడం లేదు. దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగినప్పటికీ, దానితో పాటు నగదు వినియోగం కూడా చాలా పెరిగింది. సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ నివేదిక వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత ఎటిఎంల నుంచి నగదు విత్‌డ్రా 235 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దు జరిగి 76 నెలలు పూర్తయిన తర్వాత 2023 మార్చి చివరి నాటికి ఎటిఎంల నుండి నగదు విత్‌డ్రాల సంఖ్య 235 శాతం పెరిగి రూ.2.84 లక్షల కోట్లకు చేరుకుంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎటిఎంలలో నింపిన నగదు మొత్తం 16.6 శాతం పెరిగిందని, అయితే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా, ఈ రాష్ట్రాలు ఎటిఎంలలో పంపిణీ చేసిన మొత్తం నగదులో 43 శాతానికి పైగా అందించాయి. 2016 నవంబర్‌లో భారతదేశంలో డీమోనిటైజేషన్ జరగ్గా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులకు పెద్దపీట వేశారు. నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడం డీమోనిటైజేషన్ లక్ష్యాలలో ఒకటిగా ఉంది.

2016లో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 2.28 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 38 కోట్లకు పెరిగిందని బుధవారం ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు సగటున 37.75 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా, వీటిలో అత్యధిక వాటా యుపిఐకి ఉంది. ఒక్క యుపిఐ ద్వారానే ప్రతిరోజూ దాదాపు 29.5 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. డీమోనిటైజేషన్ నుంచి ఆరేళ్ల కాలంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగినా, నగదు వినియోగం తగ్గలేదని, ఈ కాలంలో నగదు లావాదేవీలు కూడా పెరిగాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News