Saturday, November 23, 2024

రోహిణిలో వానాకాలం

- Advertisement -
- Advertisement -

అనురాధాలో యాసంగి, వరినారుపై రైతులకు సిఎం దిశానిర్దేశం

వరి తుకం పోసేటప్పుడు కాదు. వరి ఈనే సమయంలో చలి ఉండొద్దు. ఈన్తానప్పడు చలి ఉంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగ ఉండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితి ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె.

మన తెలంగాణ/హైదరాబాద్: గత పాలకులు నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రథమ ప్రాధామ్యంగా రా ష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింద ని సిఎం అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి సపోర్టు వ్యవస్థలయిన చెరువులు విద్యుత్తు సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామని తెలిపారు. తత్ఫలిత మే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శం గా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి అని సిఎం పేర్కొన్నారు. నేడు తెలంగాణలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యల ను రైతులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు చేపట్టాలని సిఎం చెప్పారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలు పర్యవసానంగా జరిగిన పంట నష్టం రైతుకు కలిగిన కష్టాలను గుణపాటంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని సిఎం అన్నారు.

తాలు తక్కువ..తూకం ఎక్కువ
“ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో వుంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వుంది. గ్రౌండ్ వాటర్ వుంది. ఇవాల మొగులు మొకం చూడకుంట కాల్వల నీల్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా వుంది. ఈ నేపథ్యం లో..మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడం వలన కోతలు కూడా లేటయితున్నయి. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15 నుంచి 20 తారీఖుల్లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి వుంటది. మరి యాసంగి ముందుగాల నాట్లు పడాలంటే వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాల్సి వుంటుంది.

అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాల్సి వుంటుంది” అని సిఎం అన్నారు. కాగా…యాసంగిలో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో వుందని అదివాస్తవం కాదని సిఎం కెసిఆర్ తెలిపారు.“వరి తుకం పోసే టప్పుడు కాదు. వరి ఈనే సమయంలో చలి వుండొద్దు. ఈన్తానప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది.

ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగ వుండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుం డా, ధాన్యం తడిసే పరిస్థితిలేకుండా..ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె” అని సిఎం వివరించారు. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే… “తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది” అని సిఎం రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సిఎం ఆదేశాల మేరకు ఆశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశంలో వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News