- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో వెలగపూడి శిబిరం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో రైతులు నిరసన చేపట్టారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ద్రోహుల గో బ్యాక్ పేరుతో ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. సెంటు స్థలాల పంపిణీపై రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధికి ఎప్పుడూ రాని సిఎం జగన్ మోహన్ రెడ్డి, మాస్టర్ ప్లాన్ దెబ్బతీయడానికి వస్తున్నారని రైతులు నిరసన తెలుపుతున్నారు.
Also Read: ఫైనల్‌కు చేరేదెవరో
- Advertisement -