Monday, December 23, 2024

సివిల్స్‌లో విజయానికి అడ్డురాని అంగవైకల్యం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: లక్ష్య సాధనకు అంగవైకల్యం ఆయనకు అడ్డుకాలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన సూరజ్ తివారీ రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, కుడి చేయి, ఎడమ చేతికి చెందిన రెండు వేళ్లు పోగొట్టుకున్నప్పటికీ 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజేతగా నిలిచారు. 2017లో ఘజియాబాద్‌లోని దాద్రిలో జరిగిన ఒక రైలు ప్రమాదంలో సూరజ్ తివారీ రెండు కాళ్లు, కుడి చేతిని కోల్పోయారు.

సూరజ్ సాధించిన విజయం పట్ల ఆయన తండ్రి రమేష్ కుమార్ తివారీ సంతోషం వ్యక్తం చేస్తూ తన కుమారుడికి మిగిలిన మూడు వేళ్లే అతని విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. తన కుమారుడిని చూసి తాను గర్విస్తున్నానని ఆయన చెప్పారు. రెండు కాళ్లు, కుడి చేయి లేనప్పటికీ తన కుమారుడు ధైర్యాన్ని కోల్పోకుండా ఎంతో ఆత్మస్థైర్యంతో సివిల్స్‌లో ఉత్తీర్ణుడయ్యాని ఆయన తెలిపారు.

యుపిఎస్‌సి 2022 పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఆల్ ఇండియా టాప్ ఐదు ర్యాంకులలో నాలుగు ర్యాంకులను మహిళలు సాధించడం విశేషం. ఇషితా కిషోర్, గరిమా లోహియా, ఉమా హారతిస్మృతి మిశ్రా మొదటి నాలుగు ర్యాంకులు సాధించారు. అస్సాంకు చెందిన మయూర్ హజారికా ఐదవ ర్యాంకు సాధించారు. మొత్తం 933 మంది అభ్యర్థులలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. వీరిని వివిధ సర్వీసులలో నియమకానికి యుపిఎస్‌సి సిఫార్సు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News