Monday, December 23, 2024

రోహిణి కార్తె అంటే ఏంటీ..? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి..?

- Advertisement -
- Advertisement -

రోహిణి కార్తే వచ్చేసింది. ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభం అయింది. రోహిణి కార్తే అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మొదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండకాలంలో ఎండలు తొలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతోంది. దినదిన ప్రవర్త మానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. దీంతో మనకు పగటి పూట చుక్కలు కనిపిస్తాయి. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఎలా ఉంటుందో చూద్దాం.

తేదీ ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఎక్కువగా ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్యా తగిన శ్రద్దలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగిజావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉండి, కొంత ఉపశమనం లభిస్తుంది.

మసాలాకు సంబంధించిన వేపుళ్లు, పచ్చళ్ళు, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకూడదు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్ళ సౌకర్యం ఉన్న వారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్ని రకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి తెల్లని రంగు వంటివి. తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభించటంతోపాటు శారీరక తాపం తగ్గుతోంది. చిన్న పిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.

ముఖ్యంగా సాటి జీవులైన పశు, పక్షాధులకు తాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగకపోయిన వాళ్ళ దాహాన్ని తీర్చేందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహ బాధలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తోంది. అంతే కాకుండా మీకు కుటుంబ సభ్యులకు ఎంతో ఫుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News