- Advertisement -
దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గాజుల గట్టయ్య ఫోన్ పడిపోవడంతో దండేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. సీఐఈఆర్ పోర్టల్‌లో ద్వారా వివరాలను నమోదు చేసి ఫోన్‌ను గుర్తించి శుక్రవారం ఎస్సై ప్రసాద్ బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… ఎవరైనా సెల్‌ఫోన్‌లను దొంగిలించిన, పోగొట్టుకున్నా ఫోన్ వివరాలను సీఐఈఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకొని పోర్టల్ ద్వారా పొయిన ఫోన్‌లను తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
- Advertisement -