Monday, December 23, 2024

సర్వ మతాల వేదిక తెలంగాణ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రకు వెళ్ళే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని బీసీ సంక్షేమ పౌరవ సరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళ్యాణి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో హజ్ యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు, టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్‌యాత్రకు వెళ్ళే యాత్రికులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హజ్ ఎంతో పవిత్రమైందని, ఆర్థిక స్తోమత లేని వారికి సైతం ప్రభుత్వం యాత్రకు వెళ్లే ఏర్పాట్లు కల్పిస్తుందని తెలిపారు.

సర్వ మతాల వేదిక తెలంగాణ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీటవేస్తుందని అమలులోను ప్రత్యేక చొరవతీసుకుంటుందని, అల్లా దయతో దేశంలోని దెయ్యాలను తరిమికొట్టాలని అన్నారు. దేశంలోనే తెలంగాణ నేడు సురక్షితంగా ఉందంటే కారణం శాంతిభద్రతల పరిరక్షణనేని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అల్లాహ్ ను ప్రార్థించాలని పిలుపునిచ్చారు.

అన్ని మతాల పండుగలను, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రాధాన్యతను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇందులో భాగంగానే తెలంగాణ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి కొనసాగుతుందని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రం దేశంలోనే సుభిక్షంగా ఉందంటే కారణం సీఎం కేసీఆర్ శాంతి భద్రతలు అదుపులో ఉండటమేనన్నారు. హజ్ యాత్రికులకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా తమకు ఫోన్ చేసి సంప్రదించాలని, తెలంగాణ ప్రభుత్వం తో పాటు, అవసరమైనచో సౌదీ అరేబియా ప్రభుత్వం తో కూడా మాట్లాడి ఎంత పెద్ద ఇబ్బందులు, సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కో ఆప్షన్ సభ్యులు హజ్ కమిటీ మెంబర్ ఇర్ఫాన్ మహ్మద్, మైనార్టీ అధ్యక్షులు షౌకత్ అలీ, వాజీద్, అన్సారీ, సాజీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News