Friday, November 22, 2024

26మంది పిల్లలను రక్షించిన అధికారులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వివిధ రాష్ట్రాలకు చెందిన 26మంది పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మంది నిందితులను రైల్వే, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, భేటీ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా భద్రత ఎడిజి శిఖాగోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న పిల్లలను ఈస్ట్‌కోస్ట్ రైలు ద్వారా విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది.

నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజాన్ మోల్లా, షేక్ సైదులు, ప్రియారుల్ షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్‌కు చెందిన పింటుదాస్, హైదరాబాద్ చార్మినార్ కు చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మాని మోండేల్ ను అరెస్టు చేశారు. నిందితులపై ఐపిసి 374,341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పని చేయించేందుకు తీసుకువస్తున్నట్లు తెలిసింది. పిల్లలను రక్షించేందుకు అధికారులు స్వచ్ఛంద సంస్థ నిర్వామకులతో కలిసి ఆపరేషన్ నిర్వహించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్న అధికారులు పిల్లలను రైలు నుంచి దింపగానే ముఠా సభ్యులను పట్టుకున్నారు. ముఠా నుంచి కాపాడిన 26మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు తరలించారు. పిల్లలను కాపాడిన వారిని అడిషనల్ డిజి శిఖాగోయల్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News