Monday, December 23, 2024

బైక్‌లు చోరీ చేస్తున్న నలుగురు యువకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బైక్‌లను చోరీ చేస్తున్న నలుగురు యువకులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన 14బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎసిపి పృథ్వీధర్‌రావు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన పవన్, గుగులోతు హరిచంద్రనాయక్, కక్కాల చిన్నా, కక్కాల దుర్గాప్రసా ద్ కలిసి బైక్‌లను చోరీ చేస్తున్నారు.వ్యసనాలకు బానిసగా మారిన పవర్ తన స్నేహితులతో కలిసి నేరాలు చేయడం ప్రారంభించాడు. గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూవెల్లర్స్‌లో చోరీ చేశాడు.

తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 14బైక్‌లను చోరీ చేసి వాటిని దుర్గాప్రసాద్ ఇంట్లో పెడుతున్నారు. కొట్టేసిన బైక్‌లను ఎపిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులతో నలుగురు కలిసి జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ఖానాకు చెందిన కొంతం హరికృష్ణ అర్జంట్ పనిమీద ఊరికి వెళ్తు బైక్‌ను కార్ఖాన సమీపంలోని క్రీమ్ స్టోన్ వద్ద పార్కింగ్ చేసి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బైక్ కన్పించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కార్ఖాన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News