Monday, December 23, 2024

టికెట్ లేనివాళ్లు 3.6 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో 2022-23లో 3 కోట్ల 60 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికులను రైల్వే పట్టుకుంది. వీరి నుంచి జరిమానాల రూపంలో వసూలు అయిన మొత్తం రూ. 2200 కోట్లుగా నిర్థారణ అయింది. ఈ విషయం ఆర్టీఐ జవాబులో వెల్లడైంది. ఇంతకు ముందటి సంవత్సరాలతో పోలిస్తే ఇప్పు డు ఈ విధమైన ప్రయాణికుల సంఖ్యలో కోటి వరకూ పెరుగుదల కన్పించింది. టికెట్లు లేకుండా ప్రయాణాలు, సరైన టికెట్లు లేకుండా తమ ఇష్టం వచ్చిన చోట కూర్చుని ప్రయాణించడం వంటి అంశాల సంబంధిత వివరాలను ఇప్పుడు వెలుగులోకి తీసుకువచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టిఐ కార్యకర్త చంద్రశేఖర్ ఈ సమాచారం రాబట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News