Monday, December 23, 2024

తొమ్మిదేళ్ళ పాలనపై పది సందేహాలు

- Advertisement -
- Advertisement -

ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం ఒక తలనొప్పి వ్యవహారం. ప్రజాస్వామ్యానికి పవిత్రత పోయిం ది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అసలు చర్చే లేకుండా 15 నిమిషాల్లో ఏ ప్రజాస్వామ్యంలో (ప్రజాస్వామ్యానికి తల్లి, తండ్రి అన్న విషయం మర్చిపోదాం) అనుమతి పొందుతారు? ఆ మూడు చట్టాలను రద్దు చేయడానికి అంతకంటే తక్కువ సమయం పట్టింది. మన రాజ్యాంగ సభలో ఏదైతే చర్చించారో అదంతా నాశనమైపోయింది. పార్లమెంటులో ఈ అంశంపైన కూడా గత తొమ్మిదేళ్ళుగా అర్థవంతమైన చర్చ జరగడం లేదు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని చెప్పడానికి బాగానే ఉంది కానీ, దేనిపైనైనా చర్చించడానికి, పరిశీలించడానికి, విచారించడానికి తిరస్కరిస్తున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ తాజాగా రాసిన ‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా’ అన్న పుస్తకంపై ‘నేషనల్ హెరాల్డ్’ ప్రతినిధితో చర్చిస్తూ, తొమ్మిదేళ్ళ మోడీ పాలనపై పది సందేహాలు లేవనెత్తారు.

1. రెండు సార్లు అధికారాన్నిచ్చినా, మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది : భారతీయ జనతా పార్టీ 2014, 2019లో రెండు సార్లు అద్భుత విజయాన్ని సాధించినప్పటికీ, అంతకు ముందున్న ప్రభుత్వం కంటే భిన్నమైన మార్పును తీసుకురావడంలో అధికారాన్ని దుర్వినియోగం చేసింది. స్వచ్ఛ్ భారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, జనధన్ యోజనా వంటి కార్యక్రమాల స్ఫూర్తితో చైతన్యాన్ని కలిగించాలనుకుంది. కానీ, దాని గురించి మంత్రులు కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. అధికారిక వెబ్‌సైట్లలో కానీ, మంత్రుల నివేదికలలో కానీ వీటి గురించి ప్రస్తావించడం లేదు. ఏం జరుగుతోందో పార్లమెంటుకు కూడా తెలపరు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాలకు కేటాయించిన నిధుల్లో 79 శాతం ప్రచారానికి, పాలనా వ్యవహారాలకే వెచ్చించారు. ప్రభుత్వం వీటి పట్ల చిత్తశుద్ధితో ఉన్నట్టు కనిపించడం లేదు.

2. రాజకీయాలు చేయడంలో ఆరితేరిన ప్రభుత్వం: అప్పటికప్పుడు ఉత్పన్నమైనది కోరుతోంది. ప్రజార్భాటంలోనూ, రాజకీయాలు చేయడంలోనూ ప్రభుత్వం చాలా ప్రతిభావంతమైందని రుజువు చేసుకుంటోంది. సమాజంలోకి దుష్ట శక్తులను ప్రవేశపెట్టడంలో పైకి కనిపించనంతగా ఆరితేరిపోయింది. సమాజంలో కుల, మత ఆర్థిక, వర్గ, లింగపరమైన తేడాలు చాలా ఉన్నాయి. అవి మరింత పెరగకుండా, ఆ గాయాలను మాన్చేలా ప్రభుత్వం చేయాలి. జాతీయవాదం అనేది అపహాస్యం పాలైంది. దానికి మరొక చీకటి కోణం కూడా ఉంది. దీర్ఘకాలం జరిగిన స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ ప్రజలను ద్వేషించే అవకాశం ఉన్నా, జాతీయ నాయకులు ఆ పని చేయలేదు.

3. మహేంద్రజాల ఆర్థిక విధానాలు: దేశం ఆర్థిక రంగం గందరగోళంగా ఉంది. ఎందుకంటే, అది మహేంద్రజాల ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంది. నల్లధనాన్ని నిర్మూలించడానికి నోట్ల రద్దు అనే విధ్వంసాన్ని చేపట్టమని మహేంద్రజాల ఆర్థికవేత్తలు కాకుండా ఎవరు సలహా ఇస్తారు? అసంఘటిత రంగాన్ని ఇది బాగా దెబ్బతీసింది. భారత దేశం 1990 కంటే కూడా దారిద్య్ర రేఖకు దిగువకు వెళ్ళిపోయింది. బిజెపికి ఎప్పుడూ పొందికైన ఆర్థిక విధానాలు లేవు. ‘గాంధీ సోషలిజం’ తన తాత్వికత అని బిజెపి దాని గురించే మాట్లాడుతోంది. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను, 1991 92 లో చేపట్టిన ఆర్థిక సరళీకరణను అది తీవ్రంగా వ్యతిరేకించింది. దాని అసంబద్ధ విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి, అసమానతలకు, సంపదపైన దృష్టి కేంద్రీకరించి, గ్రామీణ విధ్వంసానికి దారి తీసింది.

4. దాని నాయకులంతా వృత్తిపరమైన విద్యనభ్యసించినవారు, శాస్త్రవేత్తలు, నిపుణులు: నిరుద్యోగం, టోకు మాంద్యం పెరిగిపోవడమే కాదు, అది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయినా ప్రభుత్వం చదువుకున్న వారి చేత చప్పట్లు కొట్టించుకుంటోంది. ప్రభుత్వం నకిలీ సైన్స్‌ను నడుపుతోంది, తిరోగమన ఆలోచనలను ప్రోత్సహిస్తోంది. భద్రత కోసం, సౌకర్యవంతమైన జీవితం కోసం, వారి ఉపాధి కోసం కొందరు తమ ఆత్మలను అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు చాలా నైపుణ్యం గలవారు, అద్భుతంగా తామనుకున్నది చెప్పగలవారు, ఈ అసమతౌల్య మాంద్యాన్ని వారు ఆనందంగా అనుభవిస్తున్నారు. పూర్వకాలంలో ప్లాస్టిక్ సర్జరీ ఉందని ప్రధాని మోడీ చెప్పగానే చప్పట్లు కొట్టి అభినందించినంతటి మహానుభావులు వారు. వారు అభిప్రాయాలకు రూపకల్పన చేయగలిగిన వారు, ప్రభావితం చేయగలిగిన వారు, ప్రభుత్వం ఈ అసంబద్ధతనుంచి ఎందుకు దూరం జరగలేదో వివరించగల వారు.

5. ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం ఒక తలనొప్పి వ్యవహారం. ప్రజాస్వామ్యానికి పవిత్రత పోయింది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అసలు చర్చే లేకుండా 15 నిమిషాల్లో ఏ ప్రజాస్వామ్యంలో (ప్రజాస్వామ్యానికి తల్లి, తండ్రి అన్న విషయం మర్చిపోదాం) అనుమతి పొందుతారు? ఆ మూడు చట్టాలను రద్దు చేయడానికి అంతకంటే తక్కువ సమయం పట్టింది. మన రాజ్యాంగ సభలో ఏదైతే చర్చించారో అదంతా నాశనమైపోయింది. పార్లమెంటులో ఈ అంశంపైన కూడా గత తొమ్మిదేళ్ళుగా అర్థవంతమైన చర్చ జరగడం లేదు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని చెప్పడానికి బాగానే ఉంది కానీ, దేనిపైనైనా చర్చించడానికి, పరిశీలించడానికి, విచారించడానికి తిరస్కరిస్తున్నారు.

6. హిందూత్వాన్ని రహస్యంగా అక్రమ రవాణా చేశారు: మోడీకానీ, బిజెపి కానీ హిందుత్వ దేశం కావాలనుకుంటే, అభివృద్ధి, సత్పరిపాలనా, అవినీతి రహిత ప్రభుత్వం అనే నినాదాలతో 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సింది. ఆ ఎన్నికల సమయంలోనే బిజెపి తమది నిజమైన లౌకిక పార్టీ అని, మిగతావి కుహనా లౌకిక పార్టీలని చెపుతూ వస్తోంది. హిందూత్వాన్ని ఒదులుకుంటున్నట్టుగా అభివృద్ధి మంత్రాన్ని జపించింది. హిందువులకు, ముస్లింలకు మధ్య పోరాటం కాదని, పేదరికానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి చేసే పోరాటమని 2013 14లో మోడీ ఉపన్యాసాలపైన ఉపన్యాసాలు ఇచ్చారు.

7. ఇది అల్పసంఖ్యాక ప్రభుత్వం: బిజెపి ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ ఇది అల్పసంఖ్యాక ప్రభుత్వం మాత్రమే. దీనికి 38% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీకి కూడా 50 శాతానికి మించి ఓట్లు పోలవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే 1984లో 50 శాతానికి సమీపంలో ఓట్లు పోలయ్యాయి. అతిపెద్ద అల్పసంఖ్యాక పార్టీనే మనల్ని పాలిస్తోంది. అలాంటి ఎన్నికల విధానంలో మనం ఉన్నాం. అల్ప సంఖ్యాకులకు పోటీగా అధిక సంఖ్యాకుల ప్రాతినిధ్యం ఏమిటి? స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాతైనా ఎన్నికల సంస్కరణల గురిం చి, ప్రభుత్వానికి అధిక ప్రాతినిధ్యం ఏమిటనేది తీవ్రంగా ఆలోచించాలి. దామాషా ప్రాతినిధ్యం అనేది ఒకొనొక పరిష్కారం. దేశం దీని గురించి ఆలోచించాలి.

8. ఇది కేవలం ఎన్నికల యుద్ధం కాదు: మృగ స్వభావం గల స్థాయిని చేరుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమైనాయి. లౌకిక వాదం, ప్రజాస్వామ్యం అనేవి బిజెపికి లభించిన ముఖ విలువలు గా అవి భావిస్తున్నాయి. బిజెపితో ఎలాంటి సైద్ధాంతిక పొత్తు లేకపోయినప్పటికీ, దానితోపొత్తు కుదుర్చుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని, తమ ఓట్ల వాటాన్ని పెంచుకుని, ఒకటి రెండు మంత్రి పదవులు దక్కించుకోవచ్చని కూడా భావిస్తున్నాయి. ఒక ఎన్నికల నుంచి మరొక ఎన్నికలకు నిద్రిస్తూనే ప్రయాణిస్తున్నాయి. రాజకీయాలంటే ఎన్నిల్లో గెలవడమే అనుకుంటున్నాయి. బిజెపి అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఆత్మసంతృప్తితో బిజెపి తన గొయ్యి తానే తవ్వుకుంటోంది.

9. అధిక సంఖ్యాకవాదం, జనాదరణ: ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం తో, తప్పుడు పరిపాలనతో కొనసాగుతున్నప్పటికీ భారతీయుల్లో దానికి అధిక సంఖ్యాకుల జనాదరణ కొనసాగుతోంది. అధిక సంఖ్యాకుల విశ్వాసంతోనే సాధ్యమవుతోంది. ‘గుజరాత్ చైతన్యం’ ‘గుజరాత్ తరహా’ గురించి మాట్లాడుతుంటే అందులో ఏమీ లేదు. అందులో శూన్యం తప్ప ఏమీ లేదని రుజువవుతోంది.

10. భాజాభజంత్రీల వెనుక ఉన్న వాస్తవం: అభివృద్ధిలో, ఉపాధి కల్పనలో, వాణిజ్యంలో పెరుగుదల ఉందని ప్రభుత్వం ఒక పక్క ఊదరగొడుతుంటే, ప్రపంచంలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లలో 19 శాతం భారత దేశంలోనే తయారవుతున్నవేనని వాల్‌స్ట్రీల్ జర్నల్ రాసింది. వాస్తవం ఏమిటి? ఫాక్స్ కాన్ ఉత్పత్తులు, ఆపిల్ ఫోన్లు వంటి స్మార్ట్ ఫోన్ల రంగం ఇక్కడ గణనీయంగా లేదు. అవి ఆర్థిక వ్యవస్థలో భాగమని చెప్పడం అర్థరహితం. అభివృద్ధికి అవి నిజమైన చిహ్నాలు కావు. చాలా మంది భారతీయులు దారిద్య్రం రేఖకు 1990 కంటే కూడా దిగువనే ఉన్నారు.

యువకుల్లో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలు భోజన కేంద్రాలుగా తయారయ్యాయి. ఐఐటిలలో, మెడికల్ కాలేజీల్లో, రాష్ర్ట విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఎనభై నాలుగు కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని ప్రభుత్వం చెపుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను చూసి ఆనందించే భారతీయులు, భారత దేశంలో అసమాతల గురించి ఆక్స్ ఫాం సమర్పించిన నివేదికను కూడా చూడాలి. సంపదంతా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని, ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారని ఆక్స్‌ఫాం నివేదిక పేర్కొంది. ఇదంతా తన గొప్పతనంగా ప్రభుత్వం భావిస్తుందా?

(నేషనల్ హెరాల్డ్ సౌజన్యంతో) రాఘవశర్మ -9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News