Friday, December 20, 2024

జూన్‌లో బ్యాంక్ సెలవులు ఎక్కువే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ సదుపాయాలు ఉన్నప్పటికీ ఖాతాల్లో డబ్బులు వేయాలన్నా లేదా పెద్దమొత్తం నగదు తీసుకోవాలన్నా, డ్రాఫ్ట్‌లు వంటి వాటి కోసం బ్యాంకులకు వెళ్లాల్సిందే. దీంతో పాటు రూ.2000 నోట్లను మార్చాలని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆదేశించింది. సెప్టెంబర్ 30లోపు ఏదైనా బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోటును మార్చుకోవాల్సి ఉంది. అయితే కొద్ది రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది.

వచ్చే నెలలో కూడా అత్యధికంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కావున ఏమైనా బ్యాంకు పనులు ఉంటే ముందస్తుగానే చేసుకోండి. తర్వాత ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ప్రధాన వార్షికోత్సవాల ప్రకారం సెలవులు నిర్ణయిస్తారు. జూన్ నెలలో శని, ఆదివారాలతో పాటు రథయాత్ర, ఖర్చీ పూజ, ఈద్ ఉల్ అజా కారణంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది.

కాగా బ్యాంకింగ్ పద్ధతుల్లో పెనుమార్పులు వచ్చాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో కూర్చొని ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును సులభంగా బదిలీ చేయవచ్చు. దీంతో పాటు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఎటిఎంని ఉపయోగించవచ్చు. ఇంకా యుపిఐ ద్వారా కూడా బ్యాంకుకు వెళ్లకుండా ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News