Saturday, November 23, 2024

నేపాల్ నుంచి భారత్‌కు విద్యుత్ విక్రయం

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ : నేపాల్ నుంచి భారతదేశానికి విద్యుచ్ఛక్తి అందుతోంది. పొరుగున ఉన్న పెద్ద దేశం భారత్‌కు చిన్న దేశం నేపాల్ శనివారం నుంచి కరెంటును ఎగుమతి చేయడం ఆరంభించింది. ఈ హిమాలయ పర్వత దేశంలో రుతుపవనాల ఆగమనంతో నదులకు అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులలో క్రమేపీ విద్యుత్ ఉత్పాదన పెరుగుతున్నందున మిగులును పొరుగుకు తరలిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే విధంగా నేపాల్ కరెంటు ఇండియాకు అందింది.

Also read: పిడుగులు పడి 12 మంది మృతి

ఇప్పుడు ఇండియాకు శనివారం నుంచి గంటకు 600 ఎండబ్లు విద్యుత్‌ను విక్రయిస్తున్నామని , తమ మిగులును ఈ విధంగా మళ్లిస్తున్నామని నేపాల్ విద్యుత్ మండలి ప్రతినిధి సురేష్ భట్టారాయ్ తెలిపారు. కొంత కాలం క్రితం వరకూ నేపాల్ తమ దేశ అవసరాలను తీర్చుకునేందుకు విద్యుత్‌ను దిగుమతి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత ఏడాది ఇండియాకు విద్యుచ్ఛక్తి సరఫరా ద్వారా నేపాల్ 12 బిలియన్ రూపాయలను సంపాదించుకుంది. ఈసారి ఈ మొత్తం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News