Saturday, December 21, 2024

ఢిల్లీకి చేరుకున్న రాజదండం సెంగోల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అధికారిక రాజదండం సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి తిరువవదుతురై మఠాధిపతులు , వేదపండితులు శనివారం అప్పగించారు. పార్లమెంట్ భవనంలో రాజదండాన్ని ప్రతిష్టిస్తారు. దీనికి ఒక్కరోజు ముందుగానే తమిళనాడుకు చెందిన స్వామిజీలు దేశ రాజధానికి చేరుకుని వేద మంత్రాల ఉచ్ఛారణ నడుమ ప్రధానికి దీనిని అందించారు. ప్రధాని మోడీ వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సందర్భంగా ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జి కిషన్ రెడ్డి ఇతరులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన మత పెద్దల నుంచి రాజదండాన్ని సవినయంగా తీసుకున్న తరువాత ప్రధాని కొద్ది సేపు మాట్లాడారు.

చారిత్రక రాజదండానికి దీనిని ముందుగా స్వీకరించిన వారు సముచిత గౌరవం ఇచ్చి ఉన్నట్లు అయితే బాగుండేదని కాంగ్రెస్‌పై ఆయన విమర్శలకు దిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దీనిని అలహాబాద్‌లోని నెహ్రూజీ కుటుంబానికి చెందిన ఆనంద్‌భవన్‌లో ఓ కర్ర తరహాలో ప్రదర్శనకు ఉంచారని తనకు తెలిసిందని, దీనిని గుర్తించి తమ ప్రభుత్వం దీనిని అక్కడి నుంచి తీసుకువచ్చిందని ప్రధాని తెలిపారు. తమిళనాడుకు చెందిన దాదాపు 60 మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఓ క్రతువు మాదిరిగా ఈ దండాన్ని ప్రధాని అధికారిక నివాసానికి తీసుకురావడం జరిగింది. తమిళనాడులోని మఠాలు లేదా అధీనంలకు ప్రత్యేకత ఉంది.

ఇవి అగ్రవర్ణాల ఆధిక్యతను ప్రతిఘటించాయని, మతాన్ని సామాన్య జనం వద్దకు , అంటరాని వారి వద్దకు తీసుకువెళ్లే క్రమంలో ముందుకు సాగాయని చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చిన వారిలో అత్యధికులు శతాధికులే . 1947 ప్రాంతంలో తొలుత ఈ అత్యంత పురాతన రాజదండం అప్పటి తొలి ప్రధాని నెహ్రూకు ముందుగా ఈ మఠాధిపతుల నుంచి ఆచారపరంగా అందింది. తరువాత లార్డ్‌మౌంట్‌బాటెన్ చేతుల మీదుగా అధికార మార్పిడికి గుర్తుగా దీనిని స్వీకరించారు. అయితే నెహ్రూకే తెలిసిన కారణాలతో ఈ రాజదండం తరువాత అలహాబాద్ మ్యూజియంకు చేరింది. నెహ్రూ కుటుంబ సభ్యులు ఉండే ఆనందనిలయంలో ఈ రాజదండం తరువాత మ్యూజియంలో ప్రదర్శన వస్తువు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News