Monday, November 25, 2024

ప్రజాస్వామ్యంపై ప్రధానికి మోడీకి విశ్వాసం లేదు: పొన్నాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల దృష్టి మరలించడానికి ప్రధాని నరేంద్రమోడీ జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పార్లమెంట్ వ్యవస్థ పై బీజేపీ చిత్తశుద్ధి ఏంటో చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పై మోడీ కి విశ్వాసం లేదని ప్రజలు తిరగబడితే నల్ల చట్టాల విషయం లో బీజేపీ తోక ఎలా ముడిచిందో భవిష్యత్ లో కమలం పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందన్నారు. బీజేపీ పాలన మాకొద్దు అని జనం చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. దేశంలో ఆర్డినెన్స్ ల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.

పార్లమెంట్ భవనం ఏదైనా బీజేపీ అప్రజాస్వామికపాలనలో ఎలాంటి మార్పు ఉండదని నల్లధనం తెస్తామన్నారు ఏమైందని నిలదీశారు. పార్లమెంట్ లో నల్లధనం గురించి చర్చించే దమ్ము బీజేపీకి లేదని.ఉద్యోగాల గురించి డిబేట్ చేసే ధైర్యం మోడీకి ఉందని ప్రశ్నించారు. అదాని కంపెనీలలో పెట్టుబడుల గురించి మాట్లాడమంటే మోడీ ఎందుకు బయపడుతున్నారు. పార్లమెంట్ పై నమ్మకం లేని వ్యక్తి కి పార్లమెంట్ కొత్త భవనం అయితే ఏంటి, పాత భవనం అయితే ఏంటిన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News