Friday, December 20, 2024

తోటి స్నేహితులతో ఈతకు వెళ్లిన బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

తిరుమలాయపాలెం:అసలే వేసవి కాలం మండుటెండల్లో స్నేహితులతో ఈత సరదా ఓ బాలుడి ప్రాణాన్ని బలి కొన్నది తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళగా ఓ స్నేహితునికి ఈత రాకపోవడంతో స్నేహితులు కళ్ళముందే గల్లంతైన సంఘటన మండల పరిధిలోని బచ్చోడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకా రం బచ్చోడు గ్రామానికి చెందిన నందిపాటి విశాల్ (14) సంవత్సరాలు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు నందిపాటి ఉపేందర్ సుమలతలకు కుమార్తె ఇందు కుమారుడు విశాల్ కాగా ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో బచ్చోడు గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చి తోటి స్నేహితులతో కలిసి మొదట క్రి కెట్ ఆడిన అనంతరం గ్రామ సమీపంలోని బావి దగ్గరికి ఈతకు వెళ్లగా నందిపాటి విశాల్ సరదాగా బావిలోకి దిగ ఈత రాకపోవటంతో నందిపాటి విశాల్ కేకలు వేస్తూ తోటి స్నేహితుల్ని కాపాడాలని కోరగా స్నేహితులు కూడా భయానికి గురై చుట్టుపక్కల వా రిని తీసుకొచ్చే సరికి నీట సుమారు నాలుగు గంటల తర్వాత పోలీసులు ఫైర్ సిబ్బంది స్థానికులు కలిసి నందిపాటి విశాల్ ను వెలికి తీశారు. ఎదిగే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మి న్నంటాయి వారు విలపిస్తున్న తీరు పలువురికి కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు ఎస్‌ఐ వరాల శ్రీనివాస్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News