Saturday, November 23, 2024

జడ్చర్ల కాంగ్రెస్‌లో క్లారిటీ ఏదీ ?

- Advertisement -
- Advertisement -

ఒకరేమో పిసిసి ఛీప్ వైపు, మరొకరు కోమటిరెడ్డి వైపు, టికెట్ ఎవరికో క్లారిటీ చెప్పని అధిష్ఠానం, ఊహల పల్లకిలో ఎర్రశేఖర్, అనురుధ్ రెడ్డి, ఎవరికి ఇచ్చినా మరొకరు రెబల్‌గా బరిలోకి, అంతిమంగా అది బిఆర్‌ఎస్‌కు లాభం

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: జడ్చర్ల హస్తంలో పోటీ అభ్యర్థి ఎవరన్నది ఇం కా క్లారిటీ రావడం లేదు. జడ్చర్ల నుంచి అనిరుధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నా రు.ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. అనిరుధ్‌రెడ్డి ఎంపి కోమటి రెడ్డి అనుచరిడిగానూ, ఎర్రశేఖర్ పిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి హామీ మే రకే ఎర్రశేఖర్ బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనా మా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిం దే. అయితే ఎర్రశేఖర్‌కు పక్కలో బల్లెంలాగా అనిరుధ్‌రెడ్డి ఉంటున్నారు.అనురుధ్‌రెడ్డి కూడా విస్ర్తుతం గా ప్రజల్లో తిరుగుతున్నారు.

కాంగ్రెస్ కార్యక్రమాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎర్రశేఖ ర్ మాత్రం లోలోపల తన వర్గాన్ని బలోపేతం చేసుకు ంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరికి టి కెట్ ఇచ్చినా మిగతా వారు రెబల్‌గా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నా రు. రెండు రోజుల క్రితం జడ్చర్ల జరిగిన పీపు ల్స్ మార్చ్ బహిరంగ సభను మొత్తం ఖర్చును అనురిధ్‌రెడ్డి పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ సభలో సైతం ఎర్రశేఖర్ పాల్గొన్నప్పటికీ నేతల దృష్టి అనురుధ్‌రెడ్డిపైనే ఉంది. ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సభలో మాట్లాడుతూ ఈ సారి కొత్త అభ్యర్ధి అనురుధ్‌రెడ్డికి పిసిసి ఛీప్ టికెట్ ఇవ్వాలని కోరారు. అలాగే హిమాచల్ ముఖ్యమంత్రి కూడా సభా ఏర్పాట్లను అనురుధ్ రెడ్డి బాగా ఏర్పాటు చేశారని పొగడ్తలు కురిపించారు.

పి సిసి ఛీప్ రేవంత్ రెడ్డి మాత్రం టికెట్ ఎవరికి అన్న విషయం స్పష్టం చేయలేదు. దీంతో టికెట్ ఎవరికి ఇస్తారన్నది కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అనురుధ్‌రెడ్డి, ఎర్రశేఖర్ మధ్య ఈ సభ మరో సారి రచ్చ కు దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయని చర్చించుకుంటున్నా రు. టికెట్ల వ్యవహారంలో సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే జడ్చర్ల టికెట్ తనకే వ స్తుందని ఎర్రశేఖర్ భావిస్తుండగా, కేంద్రంలోని పె ద్దల అండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ ండదండల తో టికెట్ తనకే వస్తుందని అనురుధ్ రె డ్డి భావిస్తున్నారు. బిసి పరంగా ముదిరాజ్ ఓట్ల ప రంగా ఎర్రశేఖర్ టికెట్ ఆశిస్తుండగా, యువత ఆధారంగా తనకే టికెట్ వస్తుందని అనురుధ్ ఆశిస్తున్నారు.

ఎవరికి ఇచ్చినా ఒకరు రెబలే ?:

ఎర్రశేఖర్, అనురుధ్ రెడ్డిల విషయంలో అధిష్టా నం టికెట్ ఎవరికి ఇచ్చినా ఒకరు రెబల్‌గా బరి లో కి దిగే అవకాశాలు ఉన్నాయని, అది అంతిమంగా బిఆర్‌ఎస్‌కు లాభం చేకూరుతుందని బిఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ నుంచి జడ్చర్లకు ప్రస్తుత ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డికి టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అదే జరిగితే కాంగ్రెస్ నేతల మద్య ఉన్న వేబేదాలు తనకు అనుకూలంగా వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆయన అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌లో అనురుధ్‌రెడ్డిని, ఎర్రశేఖర్‌ను కాదని మూడో వ్యక్తికి అవకాశాలు ఇచ్చే అవకాశాలను కాంగ్రెస్‌లోని కొందరు నేతలు కొట్టి పడేయలేకున్నారు. చివర్లో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని, కొత్త ముఖాలు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సామాజిక,రాజకీయ సమీకరణాల మేర కు చివరి వరకు ఎవరికి అన్నద కూడా చెప్పలేమని చెబుతున్నారు. పిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి కూడా గెలుపుగుర్రాలకే టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కూడా టికెట్ విషయంలో ఎవరికి ఆయన హామీ ఇవ్వలేకున్నారు. దీంతో జడ్చర్ల కూడా కన్యూజన్‌లోనే ఉందని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News