Saturday, December 21, 2024

కారు ప్రమాదానికి గురైన నటుడు శర్వానంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఇది ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే శర్వానంద్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో ప్రమాదానికి గురయ్యారు. శర్వానంద్ ఒకేసారి అనేక సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన రక్షితా రెడ్డితో నిశ్చితార్థాన్ని ప్రకటించారు. జరుగనున్న వారి వివాహంపై ఈ ప్రమాదంఅనుమాన ఛాయలను కమ్మింది.

శర్వానంద్ వాహనం రేంజ్ రోవర్ ఫిలింనగర్ జంక్షన్‌లో అదుపుతప్పడంతో తల్లకిందులైంది. స్థానికులు సకాలంలో ప్రతిస్పందించి అతడిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా నటుడి కుటుంబ సభ్యులు ఇంకా నోరు విప్పలేదు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శర్వానంద అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు.

Sharwanand2

Sharwanand 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News