Monday, December 23, 2024

జూన్ 24 నుంచి పోడు భూములకు పట్టాలు..

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి: వచ్చే నెల జూన్ 24 నుంచి పోడు భూముల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పోడు భూముల లబ్దిదారులకు రైతుబంధు, రైతుభీమా పథకం ఇతర ప్రభుత్వ సదుపాయాలకు అర్హులని ఆయన వివరించారు. పోడు భూముల లబ్దిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్,మాజి మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిలా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక డిఎస్పీ శ్రీనివాసులు, స్థానిక నాయకులు కుడుముల సత్యం, సత్యంరావు, నారాయణ, ఉషాగౌడ్, ఆసుపత్రి సూపరింటెడ్ రవీంద్రమోహన్, ప్రతాప్ రెడ్డి, నునుగొండ శ్రీనివాస్ తో పాటు వివిద మండలాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News