Saturday, December 21, 2024

ఎన్విడియా కొత్త ఎఐ సూపర్ కంప్యూటర్ ‘డిజిఎక్స్ జిహెచ్200’

- Advertisement -
- Advertisement -
ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది!

న్యూఢిల్లీ: చిప్ తయారీ కంపెనీ ఎన్‌విడియా కొత్త క్లాస్ లార్జ్ మెమరీ ఉన్న ఏఐ సూపర్ కంప్యూటర్‌ను ప్రకటించింది. ఇది జిహెచ్200 గ్రేస్ హాపర్ సూపర్ చిప్స్, ఎన్‌విలింక్ స్విచ్ సిస్టంతో నడిచే ఎన్విడియా డిజిఎక్స్ సూపర్ కంప్యూటర్. కంపెనీ కథనం ప్రకారం ఈ ఏఐ సూపర్ కంప్యూటర్‌ను జనరేటివ్ ఏఐ లాంగ్వేజ్ అప్లికేషన్స్, రికమండర్ సిస్టమ్, డేటా అనలిటిక్స్ వర్క్‌లోడ్స్ కోసం, తదుపరి తరం మోడల్ అభివృద్ధి కోసం, ఈ ఏఐ సూపర్ కంప్యూటర్‌ను సృష్టించారు. ఈ ఏడాది చివరికల్లా ఇది అందుబాటులోకి రాగలదు.

ఎన్విడియా వ్యవస్థాపకుడు, సిఈవో జెన్సన్ హువాంగ్ ప్రకారం గూగుల్ క్లౌడ్, మెటా, మైక్రోసాఫ్ట్ డిజిఎక్స్ జిహెచ్ 200 యాక్సెస్‌ను పొందాలనుకున్న వాటిలో మొదటివి. ఏఐ మోడల్స్ పెరుగుతున్న కొద్దీ, శక్తివంతమైన మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి’ అని మెటాలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏఐ సిస్టమ్స్ అండ్ యాక్సిలరేటెడ్ ప్లాట్‌ఫారమ్స్ వైస్ ప్రెసిడెంట్ అలెక్సిస్ బ్జోర్లిన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News