Monday, December 23, 2024

గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -
  • ఇద్దరి అరెస్టు, ట్రాక్టరు స్వాధీనం
  • భద్రాచలం ఎఎస్‌పి పారితోష్‌పంకజ్ వెల్లడి

భద్రాచలం : మీదుగా అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువ చేసే గంజాయిని పట్టుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఎఎస్‌పి పారితోష్‌పంకజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక కూనవరం రోడులోని సీఆర్‌పిఎఫ్ క్యాంపు సమీపంలో గల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా, మల్కాన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా కరీంనగర్‌కు ట్రాక్టరుపై తరలిస్తున్న గంజాయి పట్టుబడినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రఘనాథ్, రబీంద్ర అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో ఆరుగురు కూడా ఈ గంజాయి అక్రమ రవాణాలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ ట్రాలీలో రహస్యంగా ఏర్పాటు చేసిన అరలో ఈ గంజాయి భద్రపరచి స్మగ్లర్లు ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఏఎస్పీ వెల్లడించారు. 5 కిలోల బరువు కల 97 గంజాయి ప్యాకెట్లను ట్రాలీలో ఉన్న సీక్రెట్ చాంబర్‌లో అమర్చి రవాణా చేస్తున్నారని, గతంలో పలుమార్లు విజయవాడ, గుంటూరు, కరీంనగర్‌లలో వీరు అమ్మినట్లు విచారణలో తేలిందని తెలిపారు. భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News