Monday, December 23, 2024

కాలువలో పడ్డ ఆటో.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

వైరా : ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి ఆటో కాలువలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన వైరాలోని సోమవరం గ్రామం సమీపంలోని చోటు చేసుకుంది. వైరా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చిన్న మునగాల గ్రామానికి చెందిన పాపగంటి ఏసుపాదం, ఎల్లమ్మ దంపతుల కుమార్తె వివాహం జూన్ 5న జరగనుండగా ఆ వివాహానికి సంభందించిన షాపింగ్

చేసేందుకు మునగాల నుండి వైరా వస్తుండగా సోమవరం కాల్వ సమీపంలో గేదే అడ్డు రావటంతో వేగంగా వస్తున్న ఆటో ఒక్కసారిగా ఆదుపుతప్పి ప్రక్కనే ఉన్న కాల్వలో పడటంతో ఆటోలో ఉన్న పాపగంటి నాగేంద్రమ్మ (50) మృతి చెందింది. ఆటోలో ఉన్న గంధం సత్యానందం, ఏసుపాదంలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి వైరా పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News