Thursday, December 19, 2024

మధ్యప్రదేశ్‌లో నాటుసారా ఎరువు

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో రైతులు కొన్ని చోట్ల తమ పంటలకు నాటుసారాను ఎరువుగా విరివిగా వాడుతున్నారు. ఇది బాగా పనిచేస్తుందని ఇది తమ పంటలకు ప్రత్యేకించి పసుపు, వరి ఇతర ధాన్యాల పంటలకు చీడలు తగులకుండా చేస్తుందని అంటున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రజలు నాటుసారా తీసుకుంటారు. అయితే చీడపీడల తొలిగింపునకు పంటపొలాలకు దీనిని వాడటం తమ పద్ధతి అని రైతులు తెలిపారు.

15 లీటర్ల నీటిలో కేవలం వంద ఎంఎల్‌ల నాటుసారాను కలిపి వీరు పంటలపై చల్లుతారు. క్రిమిసంహారక మందులు, పలురకాల ఎరువుల ఖర్చుతో పోలిస్తే ఈ నాటుసారా ఖర్చు భారం తమకు బాగా తగ్గుతుందని ఇక్కడి రైతులు కొందరు తెలిపారు. ఇది వాడితే తమకు దిగుబడి కూడా బాగా వస్తుందన్నారు. అయితే ఇది పద్దతైన ఎరువు కాదని నిపుణులు తెలిపారు. కానీ దీనిని తాము నమ్ముకున్నామని రైతులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News