Friday, November 22, 2024

తొలిసారి రక్తం, ఎముక మజ్జ క్యాన్సర్‌కు చికిత్స చేసిన గుర్‌గావ్ డాక్టర్లు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మైలోయిడ్ లుకేమియాతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలిక జబ్బును ప్రత్యేకమైన కీమోథెరపి కాంబినేషన్ కాంబినేషన్ ఔషధాల ద్వారా విజయవంతంగా నయం చేశారు. గురుగావ్‌లోని ఫోర్టీస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వికాస్ దువా నేతృత్వంలో హెమటో ఆంకాలజీ బృందం చికిత్స చేశారు. ఆమె రక్తం, ఎముకల మజ్జ క్యాన్సర్ నయం చేయలేని విధంగా మారిపోయింది. అంటే చికిత్సకు అందకుండా పోయింది. వెనెటోక్లాక్స్, అజసిటిడిన్ కాంబినేషన్‌ను సాధారణంగా డాక్టర్లు పిల్లలకు ఇవ్వరు. కానీ ఈ బాలికకు నెలలకొద్దీ ఇచ్చారు. ఆమెకు ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు గత ఏడాది ముంబయిలో నిర్ధారణ అయింది. ముంబైలో ఆమెకు నయంకాకపోవడంతో ఆమెను గుర్‌గావ్‌కు మార్చారు. అక్కడ ఆమెకు రెండోసారి కీమోథెరపి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె రక్తంలో క్యాన్సర్ కణాలు కొనసాగాయి. ఆ తర్వాత ఆమెకు ఎముక మజ్జ పరీక్ష, లక్షిత థెరపీ చేశారు.

లుకేమియాను నియంత్రించేందుకు ఆమెకు కీమోథెరపీ కాంబినేషన్ చికిత్స అందించారు. తరాత ఆమెకు ఎముక మజ్జ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేశారు. ఆమె తల్లే ఆమెకు స్టెమ్ సెల్ డోనర్ అయింది. లుకేమియా అనేది తెల్ల రక్త కణాలను దెబ్బతీస్తుంటాయి. ఈ తెల్ల రక్త కణాలే వ్యాధి సంక్రమణలను ఎదుర్కొంటుంటాయి. కానీ లుకేమియా ఉన్న వారిలో ఎముక మజ్జ అసాధారణ రీతిలో తెల్ల రక్త కణాలను రూపొందిస్తుంటుంది. అవి మామూలుగా, సరిగా పనిచేయవు. లుకేమియా ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: చమట ఎక్కువ పడుతుంటుంది. దీర్ఘకాలికంగా నీరసం, బలహీనత ఉంటాయి. బరువు తగ్గిపోవడం ఉంటుంది. ఎముకల నొప్పి ఉంటుంది.లింఫ్ గ్రంథులు వాస్తాయి. కాలేయం పెద్దదవుతుంది. రక్తం కారడం, గాయలవ్వడం జరుగుతుంది. జ్వరం, చలి ఉంటాయి. లుకేమియాకు కారణమయ్యేవేమిటనే దానిపై నిపుణులకు కూడా స్పష్టమైన అవాగాహన ఉండదు. కానీ వాటికి ఉండే రిస్క్ ఫ్యాక్టర్లు మాత్రం వారు గుర్తించగలరు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News