Monday, December 23, 2024

విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు

- Advertisement -
- Advertisement -

కరకగూడెం : పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలంలో దోమలు, ఈగలు వ్యాప్తి పూర్తిగా విపరీతంగా పెరిగడంతో మండలంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గత వారం రోజుల్లో డెంగ్యూ జ్వరాలతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దోమలు విపరీతంగా పెరగడానికి కారణాలు పరిసరాల అపరిశుభ్రత, మురుగునీరు నిల్వ వల్ల దోమల వ్యాప్తి సంక్రమిస్తుంది. గ్రామపంచాయతీలో మురుగునీరు నిల్వచేరకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఏ ఒక్క అధికారి కూడా అవగాహన కల్పించకపోవడం ప్రధాన కారణమని చెప్పాలి.

ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తున్నారు. కానీ తర్వాత పట్టింపే లేదు. గత కొన్ని రోజులుగా గ్రామాల్లో విపరీతంగా దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్న కొన్ని పంచాయతీలలో దోమల వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి అధికారులు దోమల నియంత్రణ మందుని వినియోగించాలి కానీ చేసే పరిస్థితి లేదు. సమాచారం ఇస్తే నేను మీటింగ్లో ఉన్న సాయంత్రం స్ప్రే చేపిస్తా అని సమాచారం ఇవ్వడం. ప్రభుత్వ అధికారులు ప్రజల క్షేమం కోసం పనిచేయాలి. అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అవేవీ అమలైనట్టు కనిపించడం లేదు.

ప్రమాదం జరుగుతేనే పట్టింపా ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు ప్రమాదాలను నియత్రించడానికి పనిచేయాలి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా పట్టింపే లేదా? మరికొన్ని గ్రామపంచాయతీలో పెద్ద సార్లు రాజకీయ నాయకులు వస్తున్నారంటేనే పరిశుద్ధ కార్యక్రమాలు చేస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నాయి. లేదంటే అంతే ఇదేం పరిస్థితి అని ప్రజల ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి పంచాయతీల్లో దోమల వ్యాప్తి నియంత్రణ చేసే పిచికారి మందును విడతల వారీగా వినియోగించి దోమలను అరికట్టవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News