Friday, December 20, 2024

బ్రహ్మోత్సవాల్లో కావ్య కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: హిమాయత్‌నగర్‌లోని వేంకశ్వరస్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం రధోత్సవం, అశ్వవాహన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యకిషన్‌రెడ్డి,స్థానిక కార్పొరేటర్ దంపతులు గడ్డం మహాలక్ష్మి, రామన్‌గౌడ్‌లతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామి వారి ఆశీస్సులను పొందారు. గత నాలుగు రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆఖరి రోజు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేంకశ్వరు స్వామి కృపకు బాధ్యులు కావాలని కావ్యకిషన్‌రెడ్డి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News