కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సురేందర్‌రెడ్డి గార్డెన్‌లో మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంగళశారం ఎ మ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాబీ జెండా ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎ మ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్ష అని, బిఆర్‌ఎస్ కష్టపడిన ప్రతీ కార్యకర్తను తప్పక గుర్తిస్తుందని అన్నారు. గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. కరోనా కష్టసమయంలో భారీ వరదల సమయంలో ప్రజల ముందుకురాని విపక్ష నాయకులంతా ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి మభ్యపెట్టేందుకు వస్తారని వారికి రాబోయేరోజుల్లో సరైన బుద్ధి చెప్పేలా కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. గత పాలకుల హయాంలో నోచుకొని అనేక అభివృద్ధి, సంక్షేమాన్ని గడిచిన ఏళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.
ఇంత చేస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలకు మన పథకా లు, కార్యక్రమాలను విస్తృతంగా తెలియజేసి కు త్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గులాబీ జెండా మూడవసారి ఎగిరేలా బిఆర్‌ఎస్ శ్రేణులు సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వ రరావు, మాజీ కౌన్సిలర్లు కిషన్ రావు, సూర్యప్రభ, డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, సురేందర్‌రెడ్డి, అరుణ, చిలుక సతీష్, జయంచారి, సిద్దయ్య, మ ధుకర్ రెడ్డి, వెంకటేష్, అజయ్, నజీర్, సత్యవతి, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలప్పుడే ప్రజల ముందుకొచ్చే నేతలకు బుద్ధి చెప్పాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -