Friday, November 22, 2024

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -
  • ఎంఎస్‌ఎస్‌ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్

పాపన్నపేట: ఇటీవల కొల్చారం సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దుర్గాగౌడ్ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం తమను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా ఘోరమని పేర్కొన్నారు.

తమవంతు సహాయం కింద దుర్గాగౌడ్ కుమారుడు నిశ్వంత్ పేరుపై యాబైవేలు, నాగరాజుగౌడ్ కుమారుడు నిశ్విత్ పేరుపై 50వేల రూపాయలచొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను త్వరలో అందజేస్తామని వెల్లడించారు. వారి తల్లి రామవ్వకు పదివేల రూపాయలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాగౌడ్ తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలు గొప్పవని, పార్టీలో చురుకైన వాడిగా ఉండేవాడని అన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు ఎంఎస్‌ఎస్‌ఓ అండగా ఉంటుందన్నారు. అమ్మ నాన్నలను కోల్పోయిన నిశ్వంత్, నాన్నను కోల్పోయిన నిశ్విత్‌ల పూర్తి చదువు బాద్యత తనదేనని అన్నారు. మనోదైర్యం కొల్పోవద్దని కుటుంబ సభ్యులను కోరారు.

వారి వెంట మండల నాయకులు పుల్లన్నగారి ప్రశాంత్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు గౌస్, సర్పంచ్‌లు శ్రీనాథ్, దాసు, సుదాకర్, గ్రామ ఉప సర్పంచ్ అజయ్, గ్రామ టీఆర్‌ఎస్ అద్యక్షులు పుట్టి సిద్దయ్య, ఏడుపాయల డైరెక్టర్ నీరుడి సిద్దిరాములు, కొత్తపల్లి సహకార బ్యాంక్ చైర్మన్ త్యార్ల రమేష్, డైరెక్టర్ తాడేపు మహిపాల్, మాజీ ఎంపీటీసీ గొల్ల బాలయ్య, ఏడుపాయల మాజీ డైరెక్టర్ దాసరి శ్రీధర్, నాయకులు కటికం బాలయ్య, పోచాగౌడ్, ప్రభుగౌడ్, నీరుడి మల్లేశం, నీరుడి రమేష్, శేఖర్‌గౌడ్,వివేకానంద యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • ఇతర కుటుంబ సభ్యులను పరామర్శ

ఎల్లాపూర్‌లో ఇటీవల మృతి చెందిన మూడు కుటుంబాల సభ్యులకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఇరవై ఐదువేల చొప్పున బాండ్లను త్వరలో అందిస్తామని వెల్లడించారు. ఎల్లాపూర్‌లో ఇటీవల మరణించిన యువకులు మంగన్న సతీష్, మఠంఎల్లం, చిన్నన్న మురళి కుటుంబాలకు ఇరవై ఐదు వేల చొప్పున బాండ్లతో త్వరలో అందిస్తామని మైనంపల్లి రోహిత్ అన్నారు. ఖర్చుల నిమిత్తం మూడు కుటుంబాలకు ఐదువేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించారు. బాదిత కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని కోరారు. అదేవిధంగా పేదరికంతో బాధపడుతున్న చిన్నన్న కిషన్‌కు నిత్యావసర సరుకులు అందించారు. నాన్నను కోల్పోయిన పిల్లలను మంచిగా చదువుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News