Monday, December 23, 2024

సివిల్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించిన సాయికృష్ణను అభినందించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా నుంచి సివిల్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించిన గ్రందె సాయికృష్ణను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో సివిల్స్‌లో 293వ ర్యాంకు సాధించిన సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఈ ప్రాంత విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడం చాలా హర్షణీయమని అన్నారు.

తల్లితండ్రులు, పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఎంతో కష్టపడతారని వారి కలలను సాకారం చేశారని కొనియాడారు. తల్లితండ్రులు ప్రోత్సాహం వల్లనే జీవితంలో ఏదైనా సాధించగలమని అన్నారు. నేను విఫలమైన రోజుల్లో తల్లితండ్రులు ఎంతో ప్రేరణనిచ్చారని, ధైర్యాన్ని అందించారని వారి ప్రోత్సాహం వలనే నేను సాధించగలిగానని చెప్పారు. సివిల్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించిన గ్రందె సాయికృష్ణ మాట్లాడుతూ చిన్నతనం నుంచి సివిల్స్ సాధించాలని కోరిక ఉండేదని చెప్పారు.

ఎలాంటి కోచింగ్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారంతో సన్నద్దమైనట్లు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని సూర్యోదయ పాఠశాలలో విద్యాభ్యాసం జరిగిందని, కేరళలోని కాలికాట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు. సివిల్స్‌కు సన్నద్దతలో తమ్ముడు సాకేట్ ఎంతో ప్రోత్సహించారని అన్నారు. ముంబాయి, హైదరాబాదులో టూలింగ్ ఇంజినీర్‌గా పనిచేశానని, తమ కుమారుడు ర్యాంకు సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తల్లితండ్రులు నాగలక్ష్మీ, శ్రీనివాసరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News