- Advertisement -
తొర్రూరు : పట్టణ కేంద్రంలోని వివిధ షాపు నిర్వాహకులు వినియోగదారులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ షాపులను సీజ్ చేస్తామని జిల్లా తునికలు, కొలతల శాఖ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని రిలయన్స్ మార్ట్, బేకరీలు, ఎలక్ట్రానిక్, ఫర్టిలైజర్స్, శానిటరీ షాపుల్లో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్చార్జ్ వింజమూరి సుధాకర్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ వినియోగదారులను తునికలు, కొలతలు, తదితర విషయాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవన్నారు. పలు షాపుల్లో గడువు ముగిసిన వస్తువులు వినియోగదారులకు అమ్మడంతో షాపు నిర్వాహకులకు రూ.20వేల జరిమానా విధించినట్లు తెలిపారు. తూకాల్లో మోసాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -