Friday, December 20, 2024

పసికందుకు సిరంజితో పురుగుల మందు ఎక్కించిన తండ్రి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: అక్రమ సంబంధంతోనే తనకు కూతురు పుట్టిందనే అనుమానంతో పసికందుకు కన్నతండ్రి సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించడంతో శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తన్మయి అనే యువతితో చందన్‌కు సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు మే 9న అమ్మాయి జన్మించింది. అక్రమ సంబంధంతోనే తన భార్య గర్భం దాల్చిందని చందన్ అనుమానం పెంచుకోవడంతో పగతో రగిలిపోతున్నాడు. ఆస్పత్రిలో రెండు వారాలు ఉన్న తరువాత తన్మయి తన పుట్టింటికి వెళ్లింది.

Also Read: తెలంగాణకు ఎవరు కావాలి?: కట్టెటోడా..కూలగొట్టెటోడా?

పాపను చూసేందుకు చందన్ తన అత్తగారింటికి వెళ్లాడు. తన్మయి మరో రూమ్‌లో ఉండగా పసికందును ఎత్తుకొని పురుగుల మందు నింపిన సిరంజిని ఎక్కించాడు. పాప ఒక్కసారిగా ఏడ్వడంతో తల్లి గదిలోకి వచ్చింది. శిశువు ఎందుకు ఏడుస్తుందని అడగగా… ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే పాపను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ఎస్‌పి సాగరిక నాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News