Friday, January 3, 2025

ఆర్‌ఒ ప్లాంట్ల ‘శుద్ధి’పై శ్రద్ధేది?

- Advertisement -
- Advertisement -
  • పుట్టగొడుగుల్లా వెలుస్తున్న (ఆర్‌ఒ ప్లాంట్లు) నీటి శుద్ధీకరణ కేంద్రాలు
  • ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
  • నిబంధనలు పాటించని నిర్వాహకులు
  • అనుమతులు లేకుండానే విక్రయాలు
  • పట్టించుకోని అధికారులు

చర్ల : మండల పరిధిలో అనుమతి లేకుండానే నీటి శుద్ధీకరణ (ఆర్‌ఒ ప్లాంట్ల) కేంద్రాలు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. సరైన నిబంధనలు పాటించకుండానే నీటి సరఫరా చేస్తూ ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లు వ్యవరిస్తున్నారు. దీంతో వారి వ్యాపారాలు మూడుపువ్వులు ఆరుకాయలన్న చందగా సాగుతోంది. చర్ల కేంద్రంగా గతంలో ఒకటి రెండు వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం పదుల సంఖ్యల్లో నీటిశుద్ధి కేంద్రాలు వెలిశాయి. నీటిశుద్ధి యంత్రాలను బోరు మోటర్లకు జతచేసి ఇష్టారీతిన కెమికల్స్ కలిపి ఫిల్టర్ నీరంటూ జనానికి అంటగడుతున్నారు. శుభ్రత, నాణ్యత లేని నీటిని సరాఫరా చేస్తున్నారని అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు.

  • నిబంధనలు పట్టించుకోని నిర్వాహుకులు

ఆర్‌ఒ ప్లాంట్ల నిర్వాహుకులు నిబంధనలు పట్టించుకోడమే మానేశారు. వాస్తవానికి నీటి స్వచ్ఛతను కొలిచే టీడీఎస్ (టోటల్ డిజాల్స్ సాలిడ్స్) దీని పరిమితి 1000 వరకే ఇది దాటిన నీరు విషతుల్యం ఈ నీరు తాగితే మూత్రపిండాలు, పాడవ్వడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం లాంటి ప్రమాదకర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణాలు నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటవుతున్న నీటి శుద్ధీకరణ కేంద్రాలు అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు తమ ఇళ్లల్లోనే ఆర్‌ఒ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నీటిని అమ్ముతున్నారన్నది జగమెరిగిన సత్యం.

ధనార్జానే ధ్యేయంగా ఆర్‌ఒప్లాంట్లు నడుపుతున్న నిర్వాహుకులు విచ్చలవిడిగా బోరు మోటర్లను వినియోగిస్తూ రివర్స్ ఆస్మోసిస్ పద్దతిలో జలాలను శుభ్ర పరుస్తూ జనాలకు విక్రయస్తున్నారు తప్ప.. టిడిఎస్‌ఏ మేర ఉపయోగించాలనే దానిని గాలికి వదిలేస్తున్నారు. మరికొందరు డొమెస్టిక్ పర్పస్‌లో వేసిన బోర్లను కమర్షియల్‌గా వినియోగిస్తూ రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. చాలా వరకు ఆర్‌ఒ ప్లాంట్లు అన్ని ఈ విధంగానే సాగుతున్నాయి. ఇంతలా ప్రజలకు హాని కలిగించే ఆర్‌ఒ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో వెనకడుగువేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • తనిఖీలు మరిచిన అధికారులు

వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అటువైపు కన్నెత్తి చూసే నాధుడే కరువయ్యాడు. కెమికల్స్ వినియోగం, నీటి శుద్ధిచేసే విధానం, నీటి నిల్వచేసే ట్యాంకుల పరిశుభ్రతపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ ఊసే మరిచారు. దీంతో నిర్వాహుకులు తమ ఇష్టానుసారంగా వాటర్ ప్లాంట్లను నడుపుతూ జేబులు నింపుకుంటున్నారు. మండలంలో దాదాపు మూడునాలుగు సంవత్సరాలుగా వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు.. స్థానిక అధికారులు సైతం వాటివైపు చూడడమే మరిచిపోయారు. ఇకపైనా అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహణపై నిఘా పెట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News