Monday, December 23, 2024

గోల్కొండలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని.. జూన్ 2వ తేదీ ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు.

జూన్ 3న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం గురించి కార్యక్రమాలను ప్రదర్శిస్తాం.. ఖిలా ఔర్ కహానీ’ పేరుతో పాఠశాల విద్యార్థులకు ఫొటో – పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లోనూ నిర్వహించేలా కేంద్రం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్‌లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు.

’ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను అన్ని చోట్లా జరుపుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఢిల్లీలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో జరుగుతాయని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లక్షలాది తెలంగాణ ప్రజలు, కుటుంబాలు భాగస్వాములయ్యాయని గుర్తు చేశారు. తాము పాల్గొనని పోరాటం అంటూ ఏదీ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News