Monday, December 23, 2024

ఆలయాల వద్ద ట్రాఫిక్ చలనాలు తగవు : విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసుల తీరు మార్చుకోకపోతే ఆందోళనకు పిలుపునిస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నగరంలో ప్రతి మంగళ, శనివారం ఆంజనేయస్వామి దేవాలయాల వద్ద, ప్రతి గురువారం సాయిబాబా దేవాలయం దగ్గర ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడుతున్నారు. దర్శన నిమిత్తం ఆయా మందిరాలకు వచ్చే భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాహనాలను నిలిపితే అదే పనిగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. ఈ తీరు మార్చుకోకపోతే ఆందోళన చేస్తామని వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News