Friday, December 20, 2024

జోడో యాత్రను అడ్డుకునేందుకు యత్నాలు

- Advertisement -
- Advertisement -

తన భారత జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించిందని రాహుల్ అన్నారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో మంగళవారం ప్రవాస భారతీయులు ‘మొహబ్బత్ కీ దుకాన్’ పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..  ‘బిజెపి తన అధికారాన్ని ఉపయోగించి ప్రజలను బెదిరించింది. అలాగే ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసింది. కానీ ఏదీ ఫలించకపోగా యాత్ర ప్రభావం మరింత పెరిగింది. జాయిన్ ఇండియా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో పాతుకు పోవడం వల్లనే ఇది సాధ్యమయింది.

ప్రజలతో అనుసంధానమయ్యేందుకు కావలసినదంతా ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి నియంత్రణలోనే ఉండిపోయిదని, అందుకే భారత్ జోడో యాత్రను ప్రారంభించాల్సి వచ్చిందని రాహుల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అవి( ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు) భారత రాజ్యాంగంపై దాడులు చేస్తూనే ఉన్నాయి. దేశంలో ప్రజల నడుమ కులం, మతం గీతలు గీసి విభజించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ భారత్ జోడో యాత్ర దేశాన్ని ఏకం చేసిందన్నారు.ఆ యాత్రద్వారా తాను ఎన్నో నేర్చుకున్నా’ అని రాహుల్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News