Monday, December 23, 2024

చలోచలో… మంత్రి మీనాక్షి పరుగులు(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, విదేశాంగ సహాయ మంత్రిణి మీనాక్షి లేఖీ బుధవారం చలో చలో అంటూ దేశ రాజధానిలో ఉరుకులు పరుగులు తీశారు. జర్నలిస్టులు, టీవీ కెమెరామెన్లు ఆమెను అంతేవేగంగా వెంబడించారు. స్థానిక కన్హట్ ప్లేస్‌లో మంత్రి బుధవారం ఓ టాయ్‌లెట్, వాటర్ కూలర్ ప్రారంభించారు. ఆ తరువాత ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో గణనీయ ప్రగతి గురించి ప్రసంగించారు. ఆ తరువాత ఆమె వేదిక దిగుతుండగా విలేకరులు రెజ్లర్ల నిరసనల సంగతేమిటీ? మహిళా రెజ్లర్లు వారి పతకాలను గంగానదీలో నిమజ్జనం చేస్తున్నారు కదా? దీనిపై ఏం చెబుతారు అని ఓ టీవీ లేడి జర్నలిస్టు ప్రశ్నిస్తూ ఉండగానే మంత్రి అక్కడి నుంచి తన కారువద్దకు పరుగులు తీశారు. ముందు విషయం తేలనివ్వండి తరువాత అన్ని తెలుస్తాయి అని చెపుతూనే రన్నింగ్ కామెంట్రీ తరహాలో వెళ్లారు.

వెంబడి విలేకరులు దూసుకువెళ్లడం వంటి సన్నివేశాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. పరుగులు తీస్తూనే మీనాఖి లేఖి రెజ్లర్ల విషయం ఇప్పుడు దర్యాప్తులో ఉంది. చట్ట ప్రకారం దర్యాప్తు కానివ్వండి అంతవరకూ చెప్పేదేమి లేదని చెపుతూ కారులోకి దూకేశారు. మీనాక్షి లేఖీ పరుగులపై కాంగ్రెస్ ఐటి విభాగం స్పందించింది. అత్యంత కీలకమైన విషయంపై మంత్రి ఎంత సూటిగా వేగంగా స్పందించారనేది ఇప్పటి వీడియోతో స్పష్టం అవుతోందని వ్యాఖ్యానించింది. మరో వైపు రెజ్లర్ల సమాఖ్య నేత బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలకు ఆధారాలు లేవని అధికారులు ధృవీకరిస్తున్నారని స్థానిక టీవీఛానల్స్‌లో వార్తలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News