Monday, December 23, 2024

ప్రహరీ విషయంలో గొడవ.. ఒకరి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మానవత్వం మంట కలిసి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపుతున్న పట్టించుకోని సమాజం
ఉరి శిక్ష విధించాలని కోరుతున్న మృతుడి భార్య

మోమిన్పేట్: ప్రహరీ గోడ విషయంలో ఇంటిపక్కనున్న ఖాజా మొయినోద్ధీన్ అలియాస్ బాబా కుటుంబ సభ్యులు గొల్ల రాములు కుటుంబంతో గొడవ పడి గొల్ల రాములు (48)ను పట్టపగలే అతి దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండల పరిధిలోని గ్రామంలో గొల్ల రాములు ఇంటి పక్కనున్న ఖాజా మొయినోద్ధీన్ కుటుంబం ఉంది. గొల్ల రాములు తన ఇంటికి ప్రహరీగోడ నిర్మించుకుంటున్నాడు.

ఈ విషయంలో పక్క ఇంటివారు ఎండి బాబా కుటుంబ సభ్యులు ఖాజా మొయినోద్ధీన్, రహీమున్నిసా, జలాల్ పాష, ఖైఫ్‌లు గొడవకు దిగారు. ఈ విషయంలో గతంలో కూడా గ్రామస్తులు పంచాయతీ పెట్టారు. ఎండి బాబా రెండు ఫీట్లు, గొల్ల రాములు రెండు ఫీట్లు మధ్యలో విడిచిపెట్టి ప్రహారీ గోడ నిర్మించుకోవాలని గ్రామ పంచాయతీ తీర్మానించి ఒప్పుకున్నారు. తీర్మానించిన ప్రకారం గొల్ల రాములు రెండు ఫీట్లు వదిలి గొల్ల రాములు బుధవారం ప్రహారీ గోడ నిర్మిస్తుండగా నాలుగు ఫీట్లు వదిలి నిర్మించుకోవాలని ఎండీ బాబా కుటుంబ సభ్యులు కట్టెలు, రాళ్లు, చేతులతో గొల్ల రాములుపై దాడి చేసి కొట్టి చంపారు. గొల్ల రాములు అక్కడికక్కడే మృతి చెందాడు.

దాడి జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అక్కడ లేరు, గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు రోదించారు. విషయం తెలిసిన వెంటనే వికారాబాద్ డీఎస్పి సత్యనారయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. పట్ట పగలే దారుణ హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని మృతుడి భార్య గొల్ల లక్ష్మి కోరారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య గొల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News