Friday, January 3, 2025

వికారాబాద్ లో ప్రేమ… పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో… ప్లేట్ మర్చాడు…

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: ప్రేమించాను… పెళ్లి చేసుకుంటానని నమ్మించి బిటెక్ చదువుతున్న విద్యార్థినిని ఇంటి యజమాని కుమారుడు గర్భవతిని చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శంకర్‌పల్లిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఓ యువతి తన తల్లితో కలిసి ఉంటుంది. యువతి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోంది. యువతితో ఇంటి యజమాని కుమారుడు కార్తీక్ రెడ్డి చనువుగా పెంచుకొని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు.

Also Read: షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!

మే 26న ఆమె కడుపులో నొప్పిగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు గర్భవతి అని చెప్పి కాన్పు చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్తీక్‌పై రేప్, మోసంతో పాటు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను ఏ తప్పు చేయలేని, పుట్టిన బిడ్డకు డిఎన్‌ఎ టెస్టు చేసుకోవచ్చని కార్తీక్ రెడ్డి చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News