Monday, December 23, 2024

సార్… మా అమ్మను నాన్నే గొడ్డలితో నరికి చంపాడు….

- Advertisement -
- Advertisement -

లక్నో: కవల పిల్లల ముందే తల్లిని తండ్రి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కమలేశ్(32), అనిత(27) దంపతులు జోరియా గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడు సంవత్సరాల వయసు కలిగిన కవల పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి గాడ నిద్రలో ఉన్నప్పుడు అనితను గొడ్డలితో తల, చాతీపై నరికి చంపాడు. అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి అక్కడి నుంచి కమలేశ్ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని తండ్రి చంపాడని కవల పిల్లలు పోలీసులకు తెలిపారు. ఆరు నెలల క్రితం కమలేశ్ తండ్రి అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. నాలుగు నెలల క్రితం కమలేశ్‌కు రోడ్డు ప్రమాదం జరగడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అతడి మానసిక స్థితి సరిగాలేదు.

Also Read: అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News