Saturday, November 23, 2024

రెజ్లర్లు సంయమనం పాటించాలి: అనురాగ్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండు చేస్తున్న మహిళా రెజ్లర్ల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గురువారం ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ&తమ ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న రెజ్లర్ల డిమాండును కేంద్రం అంగీకరించిందని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు.

రెజ్లర్ల డిమాండు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అలాగే రెజ్లర్ల కోరిక మేరకు రెజ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, కాని ఆ కమిటీ పనిచేయకుండా రెజ్లర్లు అడ్డుపడుతున్నారని ఠాకూర్ చెప్పారు.
మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు రెజ్లర్లకు సూచించిందని ఆయన తెలిపారు. క్రీడలను కించపరచడం లేదా క్రీడాకారుల మనోభావాలు దెబ్బతినే విధంగా చర్యలు తీసుకోవద్దని ఆయన రెజ్లర్లను కోరారు. ఆరోపణలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రెజ్లర్లు సంయమనం పాటించాలని, సుప్రీంకోర్టుపై విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News