Monday, January 20, 2025

మల్కాపూర్‌లో బ్రాంచీ పోస్టాఫీస్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
  • నెరవేరిన మంత్రి హరీశ్‌రావు హామీ, గ్రామస్థుల హర్షం

తూప్రాన్: ఐదు నెలల క్రితం మల్కాపూర్ గ్రామస్థుల విన్నపాల మేరకు మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ నెరవేరింది. తూప్రాన్ మండలంలో ఆదర్శ గ్రామమైన మల్కాపూర్‌లో మంజూరైన తపాలా శాఖ బ్రాంచి పోస్టాఫీసు కార్యాలయాన్ని గురువారం ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీహరితో కలిసి ప్రారంభించారు. గత జనవరి 9న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మల్కాపూర్ విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దృష్టికి గ్రామస్థులు తమ గ్రామంలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ప్రత్యేక చొరవతో గ్రామానికి నూతన తపాలా శాఖ సేవలు అందుబాటులోకి రావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.తపాలా శాఖ సేవలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ప్రతాప్‌రెడ్డితోపాటు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి సూచించారు. తపాలా శాఖను పటిష్టం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని అలాగే అడిగిన వెంటనే పోసాఫీస్‌ను మంజూరుచేసిన మంత్రి హరీశ్‌రావు, తపాలా శాఖ ఉన్నత అధికారులకు గ్రామస్థుల తరపున సర్పంచ్ మహాదేవి, ఉప సర్పంచ్ అంజనేయులుగౌడ్‌లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పంజాల వెంకటమ్మ, డిఎల్‌పిఓ శ్రీనివాసరావు, ఇంచార్జి ఎంపిడిఓ రమేష్, పోస్టల్ శాఖ సిఐ సందీప్, వార్డు సభ్యురాలు మన్నె మమత, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, మేకిన్ మల్కాపూర్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News